పైలెట్‌తోనే తాండూరు ప్రగతి

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్‌తోనే తాండూరు ప్రగతి
– ఇచ్చిన హామీ మేరకు నిధుల వరధ
– రూ.134 కోట్ల సీడీపీతో నియోజకవర్గ అభివృద్ధి
– ఎమ్మెల్యేతో అభివృద్ధికి కలిసి రండి
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతోందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహాకారంతో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జీఓ 369 ద్వారా రూ. 134 కోట్ల సీడీపీ నిధులు తీసుకరావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బషీరాబాద్ మండలానికి రూ. 3కోట్లు, ఐటీఐ కాలేజీకి రూ. 3 కోట్లు, తాండూరు మండల కేంద్రంతో పాటు కరణ్ కోట్, ఇతర 144 గ్రామాలకు రూ. 78 కోట్లు, బీసీ భవన్‌కు రూ. 2కోట్లు, బంజార భవన్‌కు రూ. 1కోటి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవనాలకు రూ. 1.50 కోట్లు, మున్సిపల్లోని 36 వార్డులకు రూ.36 కోట్లు, నూతన మార్కెట్ కమిటి భవనానికి రూ.10కోట్లు కేటాయించండం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిధులు సాధించడం జరిగిందన్నారు. విద్యా, వైద్యం, రవాణా రంగాలలో మెరుగైన పురోగతి సాధించేలా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని అన్నారు. తాండూరు రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే పేర్కొన్న విధంగా వచ్చే మూడు మాసాల్లో తాండూరు అభివృద్ధి ప్రగతి పథంలో నడుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేయకుండా పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వెంట అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు.