ఆధైర్య పడకు.. అండగా ఉంటాం..!
– ఎల్లయ్య గౌడ్ కు స్నేహితుల ఓదార్పు
– ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఆత్మశాంతికి మౌనం
– పరామర్శించిన ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆధైర్య పడకు.. అండగా ఉంటామని చేవేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన ఎల్లయ్య గౌడ్ కు ఆయన క్లాస్ మేట్స్, స్నేహితులు ధైర్యం చెప్పారు.

ఆదివారం ఎల్లయ్య గౌడ్ క్లాస్ మేట్స్(1989-90 బ్యాచ్) యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తనూష, సాయిప్రియ, నందిని చిత్రపటాలకు పూలు వేసి వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. అనంతరం ఎల్లయ్య గౌడ్ ను ఓదార్చారు. బ్యాచ్ లో ఉన్న తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కూడా ఎల్లయ్య గౌడ్ కు పరామర్శించారు.

స్నేహితులంతా కలిసి ఆధైర్య పడకు.. మేమంతా అండగా ఉంటామని ఎల్లయ్య గౌడ్ కు మనోధైర్యం అందించారు. పరామర్శించిన వారిలో స్నేహితులు ఏర్పుల చంద్రప్ర, నాగారం పాండు గౌడ్, చంద్రకాంత్, వీరేశం, గోపాల కృష్ణ, అంనతయ్య గౌడ్, విష్ణు వర్ధన్ రెడ్డి, ప్రసాద్, బసయ్య, వెంకటయ్య, అజీముద్దీన్, రాజు గౌడ్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

