ఓరి దేవుడో..!
– ప్రాణాలమీదకు వచ్చిన ఫోన్ వదల్లేదు
– అమ్మాయి నుంచి వెళ్లిన రైలు
– సోషల్ మీడీయాలో వీడియో వైరల్
దర్శిని డెస్క్: స్మార్ట్ ఫోన్ భూతం అందరిని ఎలా పట్టి వేధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికంగా స్మార్ట్ఫోన్ల వినియోగం ఆరోగ్యానికి హానికరం’ అని చెప్పినా.. ఎవ్వరూ పట్టించుకోరు. ఉదయం లేచిన దగ్గరుంచి రాత్రి నిద్రపోయే వరకు చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. చాలా వరకు ఇది పెద్ద వ్యసనమే అయినా.. అంతకుమించి అంటూ కొందరు స్మార్ట్ ఫోన్ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అప్పుడు కూడ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వదలరు. అలాంటి దృశ్యానికి రూపమిస్తూ ఓ అమ్మాయి చేసిన పనికి ఓరి దేవుడో అనక తప్పదు. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రైలు వెళుతుండగా.. రైలు కింద పట్టాల మద్య ఓ అమ్మాయి పడుకుని ఫోన్ మాట్లాడుతున్నట్లు చూడవచ్చు. వీడియోను తీక్షణంగా చూస్తే.. ట్రైన్ కింద ఓ అమ్మాయి కనిపిస్తుంది..! మీకు కనిపించిందా.? వీడియో చివర్లో ఆమె ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది. ఇప్పటికైనా మీకు అర్దమైంది కదా.! ‘అక్కకు పాణం కంటే ఫోన్ కాల్ ముఖ్యం’ అని లెక్క.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.(గమనిక: వీడియోకోసం ట్విట్టర్ లింక్‌ను క్లిక్ చేయండి)
ट्रेन आती-जाती रहेगी लेकिन कॉल नहीं कटना चाहिए 😂😂 pic.twitter.com/x72ARehBvU
— SANJAY TRIPATHI (@sanjayjourno) November 28, 2022

