మైనర్ల కీచకపర్వం..!
– పదో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం
– సెల్ఫోన్లో వీడియో తీసి బ్లాక్ మేయిల్
– సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: పట్టుమని పదో తరగతి చదువుతున్న మైనర్లు తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారంతో కీచకపర్వాన్ని కొనసాగించారు. అత్యాచారాన్ని వీడియో తీసి బ్లాక్ మేయిల్ చేస్తూ 10 రోజుల తరువాత మళ్లీ అత్యారారానికి పాల్పడ్డారు. ఆగస్టులో జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో షేక్ చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష సంఘటన హైదరాబాద్ నగర శివారు హయత్నగర్ పరిధిలో కలకలం రేపింది. బాధిత బాలిక గ్రామంలోని స్థానిక హై స్కూల్లో పదో తరగతి చదవుతోంది. ఆమెతో పాటు చదువుతున్న నలుగురు విద్యార్థులు అగస్టు 16న విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించి బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులు అత్యాచారాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బాలికను బెదిరించారు. అనంతరం 10 రోజుల తర్వాత మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా అప్పటి వీడియోను నిందితులు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

