తాండూరు మొనగాడికే ఎమ్మెల్యే టిక్కెట్టు.!
– బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి కన్ఫామ్
– ఎమ్మెల్సీనే ఎమ్మెల్యేతో కలిసి వస్తారు
– మీడియా సమావేశంలో పార్టీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దాదాపు నలభై ఏండ్లుగా జరగని అభివృద్ధి చేసి చూపిస్తున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు మొనగాడు అని, వచ్చే ఎన్నికల్లో ఆయనకే టిక్కెట్టు కన్ఫామ్ అయ్యిందని నమ్ముతున్నామని బీఆర్ఎస్ తాండూరు నేతలు అన్నారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్. అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు మీడియాతో మాట్లాడారు. తాండూరు ఎమ్మెల్యే టిక్కెట్ నాకే వస్తుందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేసిన వాఖ్యలను ఖండించారు. దాదాపు 40 ఏండ్లుగా జరగని అభివృద్ధిని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసి చూపిస్తున్నారని. అన్నారు. తాండూరుకు ఎన్నడు లేని విధంగా రూ. 134 కోట్లు సాధించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి, నర్సింగ్ కాలేజీ, ఐటీఐ కాలేజీ, బీసీ భవన్, బంజార భవన్, దళిత భవన్, జాతీయ రోడ్డు, రోడ్డు విస్తరణ పనులతో ఎమ్మెల్యే గ్రాఫ్ పెరిగిపోయిందన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి 30 ఏండ్లుగా తన క్యాడర్ను పట్టించుకోలేదని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులకు జిల్లా స్థాయి పదవులు ఇప్పించారని అన్నారు. అది గమనించి ఎమ్మెల్సీ వర్గీయులు ఎమ్మెల్యే వర్గంలోకి చేరుతున్నారని అన్నారు. దీనిని జీర్ణించుకోలేక కార్యకర్తలను, ప్రజలను మభ్య పెట్టేందుకు టిక్కెట్టు వ్యవహారాన్ని తెరపైకి తీస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారని, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన కృషితో సీఎం కేసీఆర్ వద్ద టిక్కెట్ను కన్ఫామ్ చేసుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందని, బీఆర్ఎస్ అభ్యర్థిగా బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఆయన వెంట ఉన్న నాయకులే మభ్య పెడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోసం పనిచేయడం ఖాయమని అన్నారు. ఇదే జరగక పోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని పార్టీల కతీతంగా గెలిపించుకోవాలని, దొంగమూక మాటలను నమ్మరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ ఘర్ చైర్మన్ రజాక్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్. ఎస్సీ సెల్ అధ్యక్షులు హన్మంతు. సోషల్ మీడియా ఇంచార్జ్ రమేష్ టైలర్, నాయకులు జలాని తదితరులు ఉన్నారు.

