విలీనంలో స‌ర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి అజ‌రామ‌రం

తాండూరు రాజకీయం వికారాబాద్

విలీనంలో స‌ర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి అజ‌రామ‌రం
– బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి
– తాండూరులో స‌ర్దార్ చిత్ర పటానికి ఘ‌న‌ నివాళులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేయ‌డంలో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ధీరోత్త‌మ కృషి అజ‌రామ‌రంగా నిలుస్తోంద‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు, తాండూరు క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శ‌నివారం తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా తాండూరు పట్టణం సర్దార్ పటేల్ చౌక్ కూడలి వద్ద సర్దార్ పటేల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయ‌న చిత్ర‌ప‌టానికి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా రాజ్ కుమార్‌తో పాటు ప‌లువురు మాట్లాడుతూ భారత స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ విముక్తి కోసం విముక్తి కోసం ఎంతోమంది త్యాగాలు చేసిన రజాకార్లను ఎదిరించి పోరాడి వీరమరణం పొందారని గుర్తుచేశారు. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణను విముక్తి కలిగింద‌న్నారు. భారతదేశంలో తెలంగాణ‌ను విలీనం చేసుకోవడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ఎంతో ముఖ్యమైంద‌న్నారు. ఆయన ఆశయాల సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్క భారత పౌరుడు ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్దార్ పటేల్ అసోసియేషన్ సభ్యులు కోటం సిద్ధిలింగం, గడ్డం వెంకటేష్, మతిన్, రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, యువ నాయకులు జూంటుపల్లి వెంకట్, రాము ముదిరాజ్, బీసీ నాయకులు నరేందర్ ముదిరాజ్, బస్వరాజ్, అనిల్, శివ, పరమేష్, సంజీవ్, మాదేవ్ తదితరులు పాల్గొన్నారు.