చల్లని సేవ అభినందనీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

చల్లని సేవ అభినందనీయం
– జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో చలివేంద్రాలు
– ప్రారంభించిన తాండూరు డీఎస్పీ, తహసీల్దార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న వేసవిలో ప్రజల కోసం చలివేంద్రాలతో చల్లని సేవను చేపడుతున్న జమియతే కృషి అభినందనీయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు తహసీల్దార్ తారాసింగ్ లు కొనియాడారు. గురువారం జమియతే ఉలేమా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్ అతహర్ ఖాస్మీ ఆధ్వర్యంలో, పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం వద్ద, వినాయక చౌరస్తా వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ప్రారంభించగా, వినాయక్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తహసీల్దార్ తారాసింగ్ లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా జమియతే చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని చలి వేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు చలి వేంద్రాల ద్వారా దాహార్తిని తీర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్లా అజరు ఖాస్మీ, తాండూరు మత అధ్యక్షులు మౌలానా హాసీఫుద్దీన్ రషీద్, వికారబాద్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ హాఫీజ్ అబ్దుల్ సలాం, ప్రతినిధులు హఫీజ్ రైసోద్దీన్, హఫీజ్ మహమ్మద్ మక్బూల్ అహ్మద్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, మౌలానా ఉమర్ ఫరూఖ్ హస్మి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!