మత విద్వేషాలను ఉపేక్షించేది లేదు
– అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు దుర్మార్గం
– బైరీ నరేష్ అరెస్టుకు ప్రభుత్వ అధికారుల చర్యలు
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేవుళ్లపై అనుచిత వాఖ్యలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడితే ఉపేక్షించేదిలేదని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. ఇటీవల వికారాబాద్ జిల్లా కోడంగల్ లో జరిగిన ఓ సమావేశంలో బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప జననంపై అనుచిత వాఖ్యలు చేయడంపై శుక్రవారం చైర్మన్ రాజుగౌడ్ ఓ ప్రకటనలో ఖండించారు. వాఖ్యలకు వ్యతిరేకంగా తాండూరు పట్టణంలో అయ్యప్ప స్వాములు చేపట్టిన నిరసనకు మద్దుతు ప్రకటించారు. బైరీ నరేష్ అయ్యప్ప స్వామి జననంపై అనుచిత వాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ మతపరమైన వాఖ్యలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని మండిపడ్డారు. ఇలాంటి వాఖ్యలకు పాల్పడితే ఎవ్వరైనా ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. అయ్యప్ప స్వామి జననంపై అనుచిత వాఖ్యలు చేసిన బైరీ నరేష్ పై చట్టపరంగా శిక్షించేలా ప్రభుత్వ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

