మరుపురాని నేత మాణిక్‌రావు
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్‌రావు మరుపురాని నేత అని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని చించొల్లి రోడ్డుమార్గం వద్ద నిర్వహించిన జయంతి వేడుకలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాణిక్‌రావు తనయుడు ఎం.రమేష్ మహారాజ్ హాజరై మాణిక్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభాకర్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు మాణిక్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ మాట్లాడుతూ రాజకీయంలో ఎందరో నాయకులకు విలువలు నేర్పిన మహనీయుడు మాణిక్ రావు అన్నారు. పేదల అభ్యున్నతితో పాటు తాండూరు ప్రాంతాభివృద్దికి ఎంతో కృషి చేసిన మాణిక్ రావును మరవడం ఎవ్వరి వల్ల కాదన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, పార్టీ సీనీయర్ నాయకులు జనార్దన్ రెడ్డి, సర్దార్ ఖాన్, ఎం.ఏ అలీం, హేమంత్‌కుమార్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నార అశోక్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి కావలి సంతోస్, పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, ఉపాధ్యక్షులు మోయిన్, ఎన్ఎస్యూఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

