సొంత భవనాలు మంజూరు చేయండి
– గల్లిగల్లికి ఎమ్మెల్యే పర్యటనలో కౌన్సిలర్ మెహరాజ్ భేగం విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని 30 వ వార్డులో అంగన్‌వాడి, డ్వాక్రా సంఘాలకు సొంత భవనాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని వార్డు కౌన్సిలర్ మెహరాజ్ భేగం, టీఆర్ఎస్ నాయకులు అఫ్పూ(నయూం) కోరారు. సోమవారం గల్లిగల్లికి ఎమ్మెల్యే రెండో విడతలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి 30వ వార్డులో పర్యటించారు. కౌన్సిలర్ మెహరాజ్ భేగం, నాయకులు అఫ్పూ(నయూం)ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పార్టీలకతీతంగా వార్డు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మెహరాజ్ భేగం మాట్లాడుతూ
వార్డులో ఉన్న అంగన్‌వాడి కేంద్రానికి సొంత భవనం లేక విద్యార్థులకు, టీచర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. దీంతో పాటు డ్వాక్రా సంఘానికి భవనం లేక సమావేశాల నిర్వహణకు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా వార్డులో సైడ్ సమస్య తిష్టవేసిందని, వెంటనే సైడ్ డ్రైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వార్డులో సీసీ రోడ్లను కూడ మంజూరు చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి స్పందిస్తూ పట్టణంలోని ప్రతి వార్డు సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, 30 వ వార్డులో కూడ సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ మురళి కృష్ణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ గుప్త, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, ప్లోర్ లీడర్ శోబారాణి, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, నీరజ బాల్ రెడ్డి, మంకాల్ రఘు, వెంకన్న గౌడ్, , బోయ రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట రెడ్డి, ఉర్దూ ఘర్ చైర్మన్ రజాక్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్, పట్లోళ్ల నర్సింలు, రాజు గౌడ్, శ్రీనివాస్ చారి, బొట్టు నర్సింలు, బాల్ రెడ్డి, నర్సి రెడ్డి, హరీహరా గౌడ్, సంతోష్ గౌడ్, సంజీవరావు, ఇంతియాజ్, రాజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
