మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– బీఆర్ఎస్ పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామానికి చెందిన పలువురు మైనార్టీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సహాకారం తాండూరులోని మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా దర్గాలకు, మసీదులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో మైనార్టీల మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబర్, హకీం ఖాన్, బర్కత్ అలీ, ముస్తఫ పటేల్, యూసుఫ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, సర్వార్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

