అదర గొట్టిన అక్షర విద్యార్థి

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

అదర గొట్టిన అక్షర విద్యార్థి
– రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఫస్ట్ ప్రైజ్
– అభినందించిన యాజమాన్యం, హెచ్ఎం
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో తాండూరు అక్షర విద్యార్థి అదరహో అనిపించాడు. సైన్స్ టీచర్ సహాయంతో పోటీలో ప్రతిభ కనబరిచి సౌత్ ఇండియా స్థాయిలో నిర్వహించే ప్రదర్శనకు ఎంపికై తాండూరు నుంచి మొదటి విద్యార్థిగా చరిత్ర సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 9వ తేది నుంచి నిర్మల్‌ జిల్లా కొండాపూర్‌లోని సెయింట్ థామస్ హైస్కూల్‌లో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక గణిత పర్యావరణ మరియు ఇన్స్పైర్ అవార్డు -2023 ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని అక్షర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సందీప్ తయారుచేసిన మొబైల్ మైక్రోస్కోప్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనలో సత్తా చాటి ప్రధమ బహుమతి సాధించాడు. రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యాటక సాంకేతిక శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. దీంతో త్వరలో సౌత్ ఇండియా స్థాయిలో జరిగే సైన్స్‌ఫేర్ ప్రదర్శనకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అక్షర పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన కృష్ణ గౌడ్ విద్యార్థి సందీప్, సైన్స్ టీచర్ రవికుమార్‌లను అభినందించారు. విద్యార్థుల్లో నైపుణ్యం, వైజ్ఞానికతను వెలికి తీసేందుకు పాఠశాల తమ వంతు ప్రోత్సహం అందిస్తుందని అన్నారు. విద్యార్థి ఫస్ట్ ఫ్రైజ్ సాధించడంలో ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, యూనుస్, ప్రవీణ్, శ్రీకాంత్ తదితరుల తోడ్పాటు ఉందన్నారు. మరోవైపు ఫస్ట్ ఫ్రైజ్ సాధించిన సందీప్‌ను ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.