బ‌ల్దియాలో కార్మికుల వేత‌న కేక‌లు..!

తాండూరు వికారాబాద్

బ‌ల్దియాలో కార్మికుల వేత‌న కేక‌లు..!
– పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ మొర
– ఏఐటీయూసీ మున్సిప‌ల్ ఎంప్లాయిస్ యూనియ‌న్ విన‌తి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రెండు నెల‌లుగా వేత‌నాలు చెల్లించ‌క ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని తాండూరు మున్సిప‌ల్ కార్మికులు ఆవేధ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పెండింగ్ వేత‌నాలు చెల్లించాల‌ని అధికారుల‌కు మొర‌పెట్టుకుంటున్నారు. పెండింగ్ వేత‌నాలు చెల్లించాల‌ని గురువారం ఏఐటీయూసీ మున్సిప‌ల్ ఎంప్లాయిస్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనీయ‌న్ ఆధ్వ‌ర్యంలో మున్సిప‌ల్ మేనేజ‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ మున్సిప‌ల్ గ‌త రెండు నెల‌ల నుంచి వేత‌నాలు చెల్లించలేద‌ని వాపోయారు. పెంచిన వేత‌నాలు అమ‌లు చేయాల‌ని ఉన్నా అమ‌లు చేయ‌డంలేద‌ని అన్నారు. రెండు నెల‌ల నుంచి వేత‌నాలు చెల్లించ‌క‌పోవ‌డంతో కార్మికులంతా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. కావున అధికారులు స్పందించి పెండింగ్ వేత‌నాలు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో యూనియ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోపాల్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పి.న‌ర్సింలు, ఉపాధ్య‌క్షులు గోపాల్, కార్మికులు త‌దిత‌రులు పాల్గొన్నారు.