తెలుగు రాష్ట్రాలకు గొప్ప వరం
– వందే భారత్ గమనానికి, ప్రగతికి నిదర్శనం
– భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి
– వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ప్రారంభం
దర్శిని డెస్క్: 2023లో ప్రారంభిస్తున్న తొలి వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలకు గొప్ప వరం అని భారత ప్రధాని నరేంద్ర మోడి ఉద్ఘాటించారు. ఆదివారం తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్‌గా జెండా ఊపడంతో ట్రైస్ సర్వీసు ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని మోడి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య ఇక వేగవంతమైన జర్నీ సాగుతుందన్నారు. తెలంగాణ-ఏపీకి వందేభారత్ పండుగ కానుక అని అన్నారు. 2023లో ప్రారంభిస్తున్న తొలి వందేభారత్ రైలు ఇది అని అన్నారు. దేశంలో డిజైన్ చేసిన, దేశంలో తయారు చేసిన రైలు ఇది చెప్పారు ప్రధాని. అతితక్కువ కాలంలో 7వందే భారత్ రైళ్లు ప్రారంభించామని వివరించారు. ఈ రైళ్లల్లో ఇప్పటికే 40 లక్షలకు పైగా ప్రజలు ప్రయాణించారు చెప్పారు. మారుతున్న దేశభవిష్యత్‌కు వందేభారత్ ఉదాహరణ అని పేర్కొన్నారు. గమనం ఎక్కడ ఉంటుందో.. ప్రగతి అక్కడ ఉంటుందన్నారు. గమనానికి, ప్రగతికి వందేభారత్ నిదర్శనం అని పేర్కొన్నా ప్రధాని మోదీ. ఇక పెద్ద గమ్యాలకు కూడా మనం చేరువు అవుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

