విహార యాత్రలో విషాదం
– కోట్పల్లి ప్రాజెక్టులు నలుగురు గల్లంతు
– అందులో ముగ్గురి మృతి, మరొకరి కోసం వెతుకులాట
తాండూరు, దర్శిని ప్రతినిధి: కుటుంబంతో సరదాగా విహార యాత్ర కోసం వచ్చిన ఓ కుటుంబంలో విషాధం నెలకొంది. వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టులో నలుగురు గల్లంతుకాగా అందులో ముగ్గురు మృతి చెందారు. మరొకరికోసం వెతుకులాట జరుగుతోంది. సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మన్నెగూడ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టు వద్దకు విహార యాత్ర కోసం వచ్చారు. కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కోటిపల్లి ప్రాజెక్టులో పడి గల్లంతు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతు అయిన నలుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోకరికి కోసం గాలింపు చేస్తున్నారు. మృతులను పూడూరు మండలం మన్నెగూడకు చెందిన లోకేశ్, జగదీశ్, వెంకటేశ్, రాజేశ్లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సరదా కోసం వచ్చిన విహార యాత్రలో నలుగురు మృత్యువాత వల్ల ఆ కుటుంబంలో విషాధం నెలకొంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు జరిగిన ప్రమాదంపై వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆరా తీస్తున్నారు.

