మనోహర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ
– గుండప్ప భౌతిక ఖాయానికి మహేందర్ రెడ్డి నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు కురుమ సంఘం నాయకులు, స్పైస్ హోటల్ యజమాని మనోహర్ యాదవ్ కుటుంబాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. సోమవారం మనోహర్ యాదవ్ తండ్రి కుర్వ గుండప్ప కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మంగళవారం మనోహర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు.

ఆయన తండ్రి గుండప్ప భౌతిక ఖాయానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం న్యాయవాది శ్రీనివాస్ యాదవ్, మనోహర్ యాదవ్‌లను పరామర్శించారు. ఎమ్మెల్సీ వెంట డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ళ నర్సింహులు, నాయకులు పట్లోళ్ళ బాల్ రెడ్డి, జనగాం మాజీ సర్పంచ్ రాములు యాదవ్, బంటు మలప్ప, శ్రీకాంత్ రెడ్డి, అశోక్ ముదిరాజ్, సిద్దు, వెంకట్ రాములు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

