ఇసుక దోపిడిని అరికట్టండి
– కాగ్నానదిని కాపాడండి
– తాండూరు డీఎస్పీకి తెదేపా విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని, రాత్రి పగలు కాగ్నానదిని దోచేస్తున్నారనే ఆరోపణలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. కాగ్నానదిలో ఇసుక దోపిడిని అరికట్టాలని, నదిని కాపాడాలని యాలాల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఎర్ర హన్మంతు కోరారు. బుధవారం తాండూరు డీఎస్పీ కార్యాయలంలో డీఎస్పీ శేఖర్ గౌడ్‌ను కలిసి రాతపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. కాగ్నా నదిలో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కాగ్ననదిని సగంలో సగం దోచుకున్నారని అన్నారు. ఇసుక అక్రమ రవాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక రవణను అరికట్టాలని తెలుగుదేశం పార్టీగా విజ్ఞప్తి చేశారు. కాగ్నా నది రక్షణకు విస్మరిస్తే రాబోయే రోజుల్లో తాండూరు మరియు ఇతర గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు.

