కొండాకు కోపమొచ్చొంది..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

కొండాకు కోపమొచ్చొంది..!
– సోంతపార్టీ నాయకుడి పట్ల నిరసన
– ఫుట్‌బాల్ బహుమతిగా ఇచ్చి ఆవేధన
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కోపమొచ్చింది. సొంత పార్టీ నేతపట్ల అసహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో భాజపా (BJP) వ్యవహారంపై ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
kvcs
రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై విశ్వేశ్వర్‌రెడ్డి ఆయన ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. భాజపా రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీకి కానుకగా ఫుట్‌బాల్‌ ఇచ్చి నిరసన తెలిపారు. పార్టీలో తనను ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్‌ తివారీని కలిస్తే.. రామచందర్‌ రావును కలవమంటున్నారు.

రామచందర్‌రావును కలిస్తే.. అభయ్‌ పాటిల్‌ను కలవమంటున్నారు. ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెబుతున్నారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కోపం రావడం.. నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి…

ఐదురోజులు వానలే..!