చలికాలంలో ఖర్జూరం తింటే..!
– సంపూర్ణ ఆరోగ్యానికి అద్బుత వరం
– రోజూ తీసుకుంటే వ్యాధులకు చెక్
దర్శిని డెస్క్: అందరు ఎంతో ఇష్టంగా తినే ఖర్జూరాలు ఆరోగ్యానికి అద్భుత వరం అంటున్నారు నిపుణులు. ఎన్నో రకాల వ్యాధుల నియంత్రణకు ఖర్జూరాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని పేర్కొంటున్నారు. చలికాలంలో ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఖర్జూరంలో ఉండే పోటాషియం ద్వారా శీతాకాలంలో అధిక బీపీని అదుపులో ఉంచడానికి పనిచేస్తాయి. వీటిలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఖర్జూరంలో ఐరన్, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన ఐరన్‌ను అందిస్తాయి. ఇక శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. వీటినుంచి ఉపశనమం కలిగించడంలో ఖర్జూరాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలతో, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. జలుబు, దగ్గును దూరం చేస్తాయి. మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చలికాలంలో చాలా మంది రక్తహీనత సమస్యలను ఎదుర్కొంటారు. ఖర్జూరం సహాయంతో రక్తహీనతను అధిగమించవచ్చు. మలబద్ధకం బాధితులకు ఖర్జూరాలు మంచి ఆహారం. ముఖ్యంగా చలికాలంలో రాత్రి పడుకునే ముందు కొన్ని ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తింటే జీవక్రియ సక్రమంగా పని చేస్తుంది. నానబెట్టిన ఖర్జూరంలో మాంగనీస్, కాపర్, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి పనిచేస్తాయి. అలాగే ఎముకలకు సంబంధించిన పలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలను తినడం ద్వారా, మీరు రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఇవి అలసట, బలహీనతను తొలగిస్తాయి. అలాగే శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతాయి. కిడ్నీలోని రాళ్ళను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. లైంగిక సమస్యలు ఉన్నవారు రోజూ ఉదయం వేళల్లో ఖర్జూరం తినడం మంచిది. ఖర్జూరం శరీరంలోని కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.

