తెలంగాణలో ప్రధాని పర్యటన ఖరారు
– వచ్చేనెల 13న హైదరాబాద్కు మోడి
– పీఎంఓ కార్యాలయం నుంచి ప్రకటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోడి పర్యటన ఖరారయ్యింది. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం నుంచి షెడ్యూల్ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19వ తేదీనే ఆయన తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆ షెడ్యూల్ రద్దయిన విషయం తెలిసిందే. జనవరి 19న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ప్రారంభం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాలను రద్దు చేసి షెడ్యూల్ మార్చారు. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైల్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తేదీన వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. తాజాగా రాష్ట్రంలో ప్రధాని మోడి పర్యటన ఖరారయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని హైదరాబాద్కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. అనంతరం పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా ప్రధాని పర్యటన తరువాత పార్టీ పెద్ద నేతలంతా వరుసగా తెలంగాణలో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గంలో పర్యటించేలా, సభలు, సమావేశాలతో ప్లాన్స్ రెడీ చేసుకుంది.

