బ్రహ్మణుల హక్కుల సాధనకు పోరాడుదాం

తాండూరు రాజకీయం వికారాబాద్

బ్రహ్మణుల హక్కుల సాధనకు పోరాడుదాం
– బ్రహ్మ గర్జన సభను జయప్రదయం చేయండి
– టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మొహన్ శర్మ
– తాండూరులో బ్రహ్మ గర్జన సభ పోస్టర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : బ్రహ్మణుల హక్కుల సాధనకు అందరు పోరాడాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య(టీబీఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్ శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ పాండురంగ దేవాలయంలో టీబీఎస్ఎస్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కళ్యాణ రావు, కార్యదర్శి జీవన్గీ రాఘవేంద్ర రావు, కోశాధికారి లక్ష్మణ్ రావు, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏప్రిల్ 23న హైదరాబాద్ లోని పరేడ్ మైదానంలో నిర్వహించే బ్రహ్మ గర్జన బహిరంగ సభకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్ శర్మ, ఉపాధ్యక్షులు వి. ప్రభాకర్ శర్మ, ముఖ్య కార్యదర్శి గాడిచర్ల నాగేశ్వర సిద్దాంతి తదితరులు సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు, పలువురు మాట్లాడుతూ సమాజంలో బ్రహ్మణులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. హక్కులను సాధించుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఏప్రిల్ 24న హైదరాబాద్ లో నిర్వహించే బ్రహ్మ గర్జన సభకు బ్రహ్మణులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీఎస్ఎస్ఎస్ క్రమశిక్షణ సమితి అధ్యక్షులు యస్. కిరణ్ కుమార్, మహిళ అధ్యక్షురాలు వాణి, తెలంగాణ బ్రహ్మణ పరిషత్ ముఖ్య సలహాదారు బి.హన్మంతాచార్, టీబీఎస్ఎస్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ చంద్ర గౌతం, రాష్ట్ర పబ్లిక్ రిలేషన్స్ అధికారి కృష్ణరావు కానగడ్డ, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి బెన్నూరు ప్రభాకర్, రాష్ట్ర సభ్యులు, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు, న్యాయవాది, బీజేపీ నాయకులు మనోహర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు కోకట్ శ్రీనివాస్ రావు, తాండూరు సంఘం గౌరవాధ్యక్షులు గోసూర్ దత్తాత్రేయ రావు, ఉపాధ్యక్షులు గురు దీక్షిత్, కోశాధికారి వామన రావు, సభ్యులు డా. సంతోస్, ఉమాకాంత్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సుభాష్ శర్మ, శ్రీనివాస్, కోడంగల్ సంఘం అధ్యక్షులు వెంకట కృష్ణమూర్తి, చేవేళ్ల ఇంచార్జ్ శ్రీధర్ రావు, తాండూరు నియోజకవర్గ అర్చక సంఘం అధ్యక్షులు పురంధరా చారి, కోశాధికారి సుధీంద్ర, సభ్యులు బెన్నూర్ వాదిరాజ్ జోషి, బషీ రాబాద్ జయరాం, దాజీపంత్ రమేష్, బాలంపేట హన్మంతాచారి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.