శ్రీశైలం చేరుకున్న పాదయాత్ర

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీశైలం చేరుకున్న పాదయాత్ర
– క్షేమంగా తాండూరు భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నుంచి శ్రీశైలం శైవ క్షేత్రానికి చేపట్టిన భక్తుల పాదయాత్ర సుఖంగా ముగింది. ఈనెల 17న బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది భక్తులు శ్రీశైలంకు పాదయాత్రగా బయల్దే వెళ్లారు. సరిగ్గా 8 రోజుల్లో భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారు. శివున్ని స్మరిస్తూ పాదయాత్రను కొనసాగించారు. మంగళవారం రోజు శ్రీశైలంకు చేరుకున్నట్లు సాగర్ గౌడ్ తెలిపారు. పాదయాత్రగా వచ్చిన భక్తులు అందరు క్షేమంగా ఉన్నారని తెలిపారు. శివుని కృపతో అందరు సంతోషంగా ఉండాలని ప్రార్ధిస్తామని అన్నారు. ఈ పాదయాత్రలో తాండూరుకు చెందిన శివ స్వాములు, పట్టణ ప్రముఖులు ఉన్నారు.