పేదల కళ్లకు కంటి వెలుగు రక్ష
– శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల కంటి సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగుతో రక్షణ కల్పిస్తుందని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని 19వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింలు హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంధత్వ నియంత్రణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు -2ను ప్రారంభించందన్నారు. కంటి వెలుగు శిబిరాలతో పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు, కంటి అద్దాలు అందజేస్తుందన్నారు. కంటి సమస్యలతో బాధపడే వారు కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముక్తార్ నాజ్, ఆసిఫ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

