ఆరుగురి పాత నేరస్తుల బైండోవర్
– తాండూరు తహసీల్దార్ ముందు హాజరు
– శాంతిభద్రతలపై పోలీసుల ముందస్తు చర్య
తాండూరు, దర్శిని ప్రతినిధి: శాంతి భద్రతల పరిరక్షణపై తాండూరు పట్టణ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ యేడాది 2023లో జరిగే అన్ని పండగలు, ఉత్సవాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పాత నేరస్తులను బైండోవర్ చేశారు. మంగళవారం పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఓ ప్రకటనలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు తాండూరు పట్టణం రాఘవేంద్ర కాలనీకి చెందిన ఎలక శ్రీనివాస్(24), వాల్మీకీ నగర్‌కు చెందిన మాసనోళ్ల చిన్న అలియాస్ నవీన్(26), కుర్వ నవీన్ కుమార్(26), బాల చెన్ను(23), నిడుగుర్తి శివకుమార్(23), అయ్యప్ప నగర్‌కు చెందిన సాటికేరి కృష్ణారెడ్డి(31) మొత్తం 6 మంది పాత నేరస్తులను తహసీల్దార్ చిన్నప్పల నాయుడు ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పాత నేరస్తులలో సత్ప్రవర్తన కోసం తహసీల్దార్ ముందు హాజరు పరచడం జరిగిందన్నారు. పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంటుందని, అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

