మురళీకృష్ణ గౌడ్ గారికి బెయిల్ మంజూరు.
– 14 రోజుల తరువాతన జైలు నుంచి విడుదల
– ప్రకటించిన సన్నిహితులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్, బీజేపీ జిల్లా నాయకులు మురళీకృష్ణ గౌడ్‌కు బేయిల్ మంజూరు అయినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. శుక్రవారం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం దేవనూర్ గ్రామంలో జరిగిన శివస్వాముల ఘటనలో గత నెల మురళీకృష్ణ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. యాలాల పోలీస్టేషన్‌లో శివస్వాములు శివమాలపై అనుచిత వాఖ్యలు చేసిన వ్యక్తిపై మురళీకృష్ణ గౌడ్ దాడికి ప్రేరేపించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. గత 14 రోజుల నుండి రిమాండ్ తరువాత మురళీకృష్ణ గౌడ్‌కు న్యాయస్థానం బేయిల్ మంజూరు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మురళీకృష్ణ గౌడ్‌తో్ పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక రాజకీయంగా కొన్ని శక్తులు రాజకీయ కక్షలో భాగంగా అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని అన్నారు. న్యాయబద్ధంగా గౌరవ న్యాయస్థానం మురళీకృష్ణ గౌడ్‌కు బేయిల్ మంజూరు చేయడం జరిగిందన్నారు. మరోవైపు మురళీకృష్ణ గౌడ్గా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చివరికి న్యాయమే గెలిచిందని, ఈ అధికార పార్టీ అరాచకాలు అండగట్టే విధంగా బిజెపి పార్టీ పనిచేస్తుందని అన్నారు. రాబోయే కాలంలో తాండూరు గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆ దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

