తాండూరుకు వస్తున్న బండి సంజయ్
– మురళీకృష్ణ గౌడ్ కుటుంబానికి పరామర్శ
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు విచ్చేస్తున్నారు. బుధవారం ఈ విషయాన్ని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ తెలిపారు. తాండూరు ప్రాంతంలో సంచలనమైన శివ స్వాములపై కేసు, రిమాండ్ ఘటనలో బేయిల్‌పై వచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీజేపీ నేత మురళీకృష్ణ గౌడ్ నివాసంపై బీఆర్ఎస్ పార్టీ యువకులు దాడికి పాల్పడిన సంఘటన తెలిసిందే. మంగళవారం చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా, రాష్ట్ర నేతలు మురళీకృష్ణ గౌడ్‌ను పరామర్శించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా తాండూరుకు విచ్చేస్తున్నట్లు సుదర్శన్ గౌడ్ తెలిపారు. మురళీకృష్ణ గౌడ్ నివాసానికి వెళ్లి కుటంబ సభ్యులు పరామర్శిస్తారని తెలిపారు.

