లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా అబ్దుల్ గని

తాండూరు రాజకీయం వికారాబాద్

లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా అబ్దుల్ గని
– ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం
– ప్రశాంతంగా ముగిసిన అసోసియేషన్ ఎన్నికలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా అబ్దుల్ గని భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని వైట్ ప్యాలెస్లో ఆసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్నికల ఇంచార్జ్ గా న్యాయవాది కె.గోపాల్ వ్యవహరించారు. ఆసోయేషన్ ఎన్నికల్లో అబ్దుల్ గని, చిక్కాల శ్రీనివాస్ లు అధ్యక్ష స్థానానికి పోటీ పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం 6 గంటల తరువాత ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 243 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో అబ్దుల్ గనికి 211 ఓట్లు రాగా ప్రత్యర్థి చిక్కాల శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల ఇంచార్జ్ గోపాల్ ప్రకటించారు. ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసిన సందర్భంగా అందరికి కృతజ్ఞతలు తెలిపారు.