కాంగ్రెస్ మాట బోగస్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ మాట బోగస్..!
– సన్నరైతులకే బోనస్ అంటూ దగా
– రైతులకు మోసం చేస్తున్న రేవంత్ సర్కార్
– తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే
– మండలంలో బీఆర్ఎ ఎస్ నేతల నిరసన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ధాన్యం రైతులకు బోనస్ ఇస్తామన్నా కాంగ్రెస్ సర్కారు దగా చేస్తోందని తాండూరు బీఆర్ఎస్ నాయకులు దజ్వమెత్తారు. రేవంత్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు మండలం చెంగోల్ గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు శ్రీనివాస్ చారి తదితరులతో కలిసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ధాన్యం రైతులకు రూ.500ల బోనస్ అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన మాటను మార్చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బోనస్ అందిస్తామన్న రేవంత్ సర్కారు దొడ్డు వడ్లు పండించిన రైతులకు కాకుండా కేవలం సన్న వడ్లు పంచించిన రైతులకు బోనస్ అందిస్తామని అనడం రైతులను దగా చేసినట్లే అని మండిపడ్డారు.. రాష్ట్రంలో 90శాతం మంది రైతులు దొడ్డు వడ్లే పండిస్తారని అన్నారు. ఈ విషయం తెలిసి ప్రభుత్వం సన్న వరి రైతులకు బోనస్ ఇస్తామని ఎలా అంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామన్నారు.

ఇదే మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే ఓట్లతో తగిన బుద్ధి చెప్పేవారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందని అన్నారు. బోనస్ విషయంలో. రైతులకు అండగా ఉంటామన్నారు. తడిసిన ధాన్యంను కొనుగోలు చేయడంతో పాటు దొడ్డు వరి రైతులకు కూడా బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌతాపూర్ మాజీ సర్పంచ్ రాజప్ప గౌడ్, మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి. వెంకటేశం, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మరోప్రాణం పోవొద్దు..!