వేధించిన వాడికి ఉరే సరి..!
– ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలి
– యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వైద్య విద్యార్థిని వేధించి.. మరణానికి కారణమైన మృగానికి ఉరే సరైన శిక్ష అని, వెంటనే అమలు చేయాలని యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ యూనివర్సీటిలో వేధింపులకు గురైన వైద్య విద్యార్థిని ప్రీతి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనను యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్ ఖండించారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఉన్న దారావత్ ప్రీతి మరణం చాలా బాధాకరమన్నారు. ఐదు రోజులు మృత్యువుతో పోరాడి మరణించడం బాధాకరమన్నారు. ఆమె మరణానికి కారణమైన నిందితుడికీ ఉరిశిక్ష ను విధించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి సంఘటన లు జరగకుండా ప్రభుత్వం, కాలేజీలు కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, పవిత్రమైన ఆత్మకు శాంతి చేకురాలని సంతాపం ప్రకటించారు.

