రేపు తాండూరులో పవర్ కట్
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు పట్టణంలో పవర్ కట్ విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం విద్యుత్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా, సీసీఐ కాలనీ, హమాలి బస్తీ, వాల్మీకినగర్, గాంధీనగర్, గొల్ల చెరువు, బస్టాండ్, రైల్వే స్టేషన్ పాటు గౌతాపూర్ రోడ్డు మార్గం ప్రాంతాలలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 9-30 గంటల నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని వెల్లడించారు. ఈ విషయాన్ని పట్టణ వినియోగదారులు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

