వృద్ధురాలి అంతక్రియతలకు చేయూత
– రూ. 3వేలు అందజేసిన బీజేపీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వృద్ధురాలి అంత్యక్రియలకు తాండూరు బీజేపీ నాయకులు చేయూతనందించారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని 15వ వార్డుకు చెందిన వృద్దురాలు మొగలమ్మ మృతి చెందారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ యువనాయకులు ఎల్లప్ప పార్టీ నేతలతో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వృద్ధురాలి అంత్యక్రియల కోసం రూ. 3 వేల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

