దత్తాత్రేయుని సన్నధిలో విఠల్ నాయక్

తాండూరు రాజకీయం వికారాబాద్

దత్తాత్రేయుని సన్నధిలో విఠల్ నాయక్
– ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి స్వామి దర్శనం
– గాన్గాపూర్ భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ కర్ణాటక రాష్ట్రం గాన్గాపూర్ దత్తాత్రేయుని సన్నిధిలో తరించారు.

ఆయన ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామి దేవాలయాలన్ని సందర్శించారు. అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే | మైనంపల్లి రోహిత్ రావు, మరో ఎమ్మెల్యే హన్మంతు రావులతో కలిసి దేవాలయంలో వెలసిన దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు.
kvcs
అనంతరం ప్రతి పౌర్ణమి మాదిరిగానే తన సొంత ఖర్చులతో దత్తాత్రేయ స్వామి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి కరుణ కటాక్షాలతో అందరు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.

ఇదికూడా చదవండి…

బీఆర్ఎస్ పార్టీకి షాక్…!