సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– 16 మందికి రూ.11 లక్షల విలువైన ఎల్ఓసీల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని పేపదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా మారిందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని యాలాల తాండూరు, తాండూరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 16 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.11 లక్షల 4,500ల విలువైన ఎల్బీసీలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరం అన్నారు. ఆనారోగ్యంతో ఉన్న పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, యాలాల మండల అధ్యక్షులు’ రవీందర్ రెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, పటేల్ ఉమాశంకర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.