పీఆర్సీ వేతనాలు చెల్లించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పీఆర్సీ వేతనాలు చెల్లించాలి
– లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదు
– ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గోపాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్ కార్మికులకు పీఆర్సీ వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గోపాల్, కార్యవర్గ సభ్యులు అశోక్, తాండూరు అధ్యక్షులు వీరేశం, కార్యదర్శి భూపతిలు విలేకరులతో మాట్లాడారు. 11వ పీఆర్సీ కింద పెంచిన వేతనాలను కార్మికులకు చెల్లించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 18 మంది కార్మికుల వేతనాలు చెల్లించాలని కోరారు. కార్మికుల వేతనాల విషయంలో అందరు వర్గపోరు వల్ల వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. వేతనాలు అందక కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. బడ్జెట్ మీటింగ్ అంటూ, కోర్టు అంశం అంటూ కార్మికులతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఈ నెల 25లోపు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఆందోళనకు సిద్దమవుతామన్నారు. అదేవిధంగా ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.