సెర్ఫ్ ఉద్యోగులకు సర్కారు అండ
– సేవలను గుర్తించే పేస్కేల్ అమలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఉద్యోగులతో కలిసి సిఎం చిత్రపటానికి పాలాభిషేకం
తాండూరు, దర్శిని ప్రతినిధి: సెర్ఫ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత అండగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేల్ అమలుపై ప్రకటన చేయడం పట్ల బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో సెర్ఫ్ ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 11 ద్వారా సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేల్ అమలుపై ప్రకటన చేయడం హర్షణీయమన్నారు. ఈ జీవో ద్వారా నియోజకవర్గంలోని 4వేలకు పైగా ఉద్యోగులకు లబ్దిచేకూరిందన్నారు. సెర్ఫ్ ఉద్యోగుల సేవలను గుర్తించే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కూడ రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్ ఉద్యోగులకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మహిళ కన్వినర్ శకుంతల, కార్మిక విభాగం అధ్యక్షులు, న్యాయవాది గోపాల్, సర్ఫ్ ఉద్యోగ సంఘం నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

