ఆధార్-పాన్ హోల్డర్లకు రిలీఫ్
– అనుసంధాన గడువు తేదిని పొడగించిన కేంద్రం
– లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే
దర్శిని డెస్క్ : ఆధార్ – పాన్ కార్డు హోల్డర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. రెండింటి లింక్ చేయడం తప్పనిసరి అని పెర్కొన్న కేంద్రం గడువును పెంచింది. కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయంతో ఉపశమనం కలిగింది. IT చట్టం, 1961 ప్రకారం, మినహాయించబడిన కేటగిరీలోకి రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసేందుకు గతంలో మార్చి 31, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 31 వరకు ఆధార్ – పాన్ లింక్ లింక్ చేయడంలో విఫలమైతే, మీ పాన్ కార్డ్‌తో ఉపయోగంలోకి రాకుండా ఉండిపోతుందని ఆదాయపన్ను శాఖ తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ద్వారా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని గతంలో చాలాసార్లు పొడిగించారు. ఇప్పటికే ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు గడువు కూడా విధిస్తూ పొడిగిస్తూ వస్తున్నారు. తాజాగా పాన్ కార్డ్ , ఆధార్ కార్డ్‌లను 30 జూన్ 2023 వరకు లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న తర్వాత, కొత్త ఫిక్స్డ్ డేట్ అంటే 30 జూన్ 2023గా నిర్ధారించారు. అ తరువాత అనుసంధానం జరగకపోతే జూలై 1 నుంచి పాన్ కార్డులు పని చేయవని తెలిపింది. పని చేయని పాన్ కార్డులు ఉన్నవారికి ఆదాయపు పన్ను రిఫండ్లు ఇచ్చేది లేదని, టీడీఎస్, టీసీఎస్‌లను అత్యధిక రేటుతో తగ్గిస్తామని వివరించింది. గడువు ముగిసిన తర్వాత ఆధార్-పాన్ అనుసంధానం చేయించాలంటే ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌ను సందర్శించి, రూ.1,000 రుసుము చెల్లించి, అనుసంధానం చేసుకోవచ్చునని తెలిపింది.

