సామాన్యులపై పిడుగు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

సామాన్యులపై పిడుగు..!
– పెరిగిన సుంగధ ద్రవ్యాల ధరలు
– ఇంకా పెరిగే అవకాశం ఉందన్న సర్వేలు
దర్శిని డెస్క్‌: రుచికరమైన ఆహారాలను తినాలనుకునే సామాన్యులపై ధరల పెంపు పిడుగు పడింది. వంటలకు వినియోగించే సుగంధ ద్రవ్యాల ధరలు పెరిగి పేదలను కుదేలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ఆహారోత్పత్తిపై వాతావరణ ప్రభావం లాంటి అంశాలతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు, ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సుగంధ ద్రవ్యాలను కొనలేని స్థితి ఏర్పడుతుండడంతో ఇకపై పేదలు టేస్ట్‌ లెస్‌ కర్రీస్‌తోనే గడిపేయాల్సిన పరిస్థితి ఏర్పడుడతోంది. వంటల్లో రుచికరమైన సువాసన, టేస్ట్ రావాలంటే సుగంధ ద్రవ్యాలు అయిన జీలకర్ర, మిరపకాయలు, లవంగాలు, యాలకులు, వంటి వాటిని వినియోగించడం తప్పనిసరి. లేదంటే కూర రుచి పచి ఉండదు. కానీ ఇప్పుడు రుచికరమైన భోజనం తినాలంటే పేదలకు కష్టతరంగా మారుతోంది. ఎందుకంటే.. సుగంధ ద్రవ్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంకా పెరుగుతాయని కూడా సర్వేలు చెబుతున్నాయి.

ప్రదీప్‌ అనే ఓ మసాలా వ్యాపారి మాట్లాడుతూ.. గత 6 నెలల్లో సుగంధ ద్రవ్యాల ధరలు చాలా పెరిగాయి. ముఖ్యంగా జీలకర్ర రేటు చాలా పెరిగింది. దీంతో పాటు ఇంగువ, ఎర్ర మిర్చి, లవంగాలు, ఆకుకూరలు, చిన్న ఏలకుల ధరలు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయని అంటున్నారు. బడా వ్యాపారులు, నల్ల వ్యాపారులు మసాలా దినుసులను మార్కెట్‌ నుంచి పెద్దమొత్తంలో కొనుగోలు చేసి విదేశాలకు కూడా తరలిస్తున్నారని.. అందుకే సుగంధ ద్రవ్యాల రేటు పెరగడానికి కారణమని అంటున్నారు. మొత్తం మ్మీద, మసాలాల రేట్ల పెరుగుదలతో ఎవరూ వీటివైపు చూడటం లేదు. ఈ ధరలతో రోజువారీ కూలీ చేసుకొని బతికేవాళ్ల పరిస్థితి ఏంటంటున్నారు వినియోగదారులు. సంవత్సర వ్యవధిలోనే కొన్ని సుగంధ ద్రవ్యాలు 50 శాతం వరకు ధరలు పెరగడం ఇదే మొదటి సారి. వర్షాలు పడడం కారణంగా దిగుబడి తగ్గిపోయింది. వ్యాపారం కూడా దెబ్బతినిందని వ్యాపారస్తులు చింతిస్తున్నారు. మొత్తంగా కూరలు కావాలనుకుంటే.. కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

పెరిగిన ధరలు ఈ విధంగా ఉన్నాయి
– ఇంగువ.. కిలో రూ. 10000 ఉండగా ఇప్పుడు దాదాపు రూ. 25 నుంచి రూ. 30000 వరకు కిలో విక్రయిస్తున్నారు.
– జీలకర్ర గత కొన్ని రోజులుగా కిలో రూ. 100 పెరిగి రూ. 280 నుండి రూ. 450కి పెరిగింది.
– ఎర్ర మిర్చి కిలో రూ. 160 నుంచి రూ. 250 నుంచి రూ. 350 వరకు విక్రయిస్తున్నారు.
– కిలో రూ.400 నుంచి రూ.700 వరకు విక్రయించే లవంగాలు ఇప్పుడు కిలో రూ.800 నుంచి రూ.1,100 వరకు అమ్ముతున్నారు.
– కొత్తిమీర రేటు కూడా పెరిగింది. కొత్తిమీర కిలో రూ. 140. ఇప్పుడు దాని ధర కిలో రూ.180కి చేరుకుంది.
– పెద్ద ఏలకులు కిలో రూ. 400 నుండి రూ. 700 వరకు అమ్ముడవుతుండగా, ఇప్పుడు దాని ధర కిలో 700 నుండి 1100 వరకు ఉంది.
– చిన్న ఏలకుల రేటు కూడా దాదాపు రెట్టింపు అయింది.
– కాశ్మీర్‌ మిరపకాయ గతంలో కిలో ₹ 400 ఉండగా, కిలోకు 700 నుండి 750కి చేరుకుంది.