బీఆర్ఎస్ నాయకుని కుటంబానికి సానుభూతి
– హన్మాపూర్లో గోపాల్ రెడ్డి తండ్రి కన్నుమూత
– పరామర్శించిన కరణం పురుషోత్తంరావు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం యాలాల మండలం హన్మాపూర్లోని బీఆర్ఎస్ నాయకుటుంబానికి ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు సానుభూతి ప్రకటించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఇంటెంటి గోపాల్ తండ్రి నర్సప్ప(72) కన్నుమూశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న కరణం పురుషోత్తం రావు హన్మాపూర్ గ్రామానికి వెళ్లారు. గోపాల్ ఇంటికి వెళ్లి నర్సప్ప మృతదేహానికి పూల మాల వేసి శ్రద్దాఅంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానభూతిని ప్రకటించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామి ఇచ్చారు. ఆయన వెంట బాలప్ప.వెంకటమ్మ. ఇ.నరేష్.బక్కని నర్సింహులు తదితరులు ఉన్నారు.

