పైలెట్‌తోనే పట్టణాభివృద్ధి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్‌తోనే పట్టణాభివృద్ధి..!
– గల్లి గల్లీకి పైలెట్ ను జయప్రదం చేయండి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పట్టణ అభివృద్ధి సాధ్యమవుతోందని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. గురువారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ శుక్రవారం నుంచి తాండూరు పట్టణంలో గల్లి గల్లీకి పైలెట్ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. గల్లి గల్లీకి పైలెట్ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మున్సిపల్లోని ప్రతి వార్డులో పర్యటిస్తారని అన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభొ త్సవాలు చేస్తారని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే కృషితో వార్డు వార్డుకు రూ. 1 కోటి చొప్పున మంజూరు కాబోతున్నాయన్నారు. దీంతో వార్డుల్లో సమస్యలు తొలగి అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

అభివృద్ధే లక్ష్యంగా గల్లి గల్లీకి పైలెట్ ద్వారా చేపడుతున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పర్యటనలో అందరు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. వార్డు కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు, అధికారులు తప్పక పాల్గొనాలని కోరారు.