అభివృద్ధికి పేద్దపీట..!
– ఇచ్చిన ప్రతి హామిని నెరవేరుస్తున్నాం
– పార్టీల అతీతంగా ప్రతి వార్డు నిధులు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– రెండో రోజు కొనసాగిన గల్లీ గల్లీకి పైలెట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలో అభివృద్ధికి పెద్ద పీట వేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిల్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గల్లీ గల్లీకీ పైలెట్ కార్యక్రమం శనివారం రెండో రోజు కొనసాగింది. తాండూరు పట్టణంలోని 18వ, 17వ, 16వ, 15వ. 14వ, 13వ, 29వ, 30వ, 35వ, 36వ, 27వ, 34వ, 28వ, 12వ, 11వ, 10వ, 9వ వార్డులలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పర్యటించారు. మున్సిపల్ వార్డుకు రూ. 1 కోటి చొప్పున మంజూరైన నిధులలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, అంగన్ వాడీ భవనాలు తదితన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహెర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా తాండూరు అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుకు రూ. 1 కోటి నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. తాండూరు బిడ్డగా నా సొంత గడ్డను ప్రగతి పథంలో నడిపించేలా కృషి చేస్తున్నానని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామిని నెరవేరుస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడ స్థానిక వాదంతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. గతంలో మోసం చేసిన పాలకులను మళ్లీ వస్తే నమ్మరాదన్నారు. అదేవిధంగా గల్లీ గల్లీకి పైలెట్ కార్యక్రమంలో భాగంగా పాత తాండూరులో బోనమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజలు చేశారు. దర్గాలో ప్రార్థనలు చేశారు.

మరోవైపు 13వ వార్డులో పలువురు మహిళలు బీజేపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మున్సిపల్ వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిహర గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, మాజీ డీపీసీ సభ్యులు పద్దోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, విజయాదేవి, మంకాల రాఘవేందర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

