రాంగ్ రూట్‌లో రావద్దు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రాంగ్ రూట్‌లో రావద్దు..!
– ప్రమాదాల కట్టడికి వన్‌ వే రూల్
– పట్టణంలో కూడ హెల్మెట్ ధరించాలి
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదాల బారిన పడోద్దని తాండూరు పోలీసులు సూచిస్తున్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని రాంగ్ రూట్ మార్గాలలో పోలీసులు ఆంక్షలు విధించారు. పట్టణంలో పలు చోట్ల వన్‌ వే విధానం తీసుకవచ్చారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నెహ్రు గంజ్ మార్గంతో పాటు పలు చోట్ల బారికేడ్లు, జిగ్ జాగ్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణం రాజీవ్ గృహ కాలనీ రోడ్డు మార్గంలో ఓ యువకుడు రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడని గుర్తుచేశారు. అందుకనే పట్టణంలో రాంగ్ రూట్ పై ఆంక్షలు విధించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని నెహ్రు గంజ్ మార్గంలో వన్ వే విధానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శివాజీ చౌరస్తాలో జిగ్ జాగ్ విధానం అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి నుంచి వాహనదారులు రాంగ్ రూట్ లో వెళ్లరాదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే.. జరిమానలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా బైకుపై వెళ్లే వాహనదారులే రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని. కావున అందరు హెల్మెట్ ధరించాలని సూచించారు. పట్టణంలో కూడా ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు