నేరాల నియంత్రణకే నిర్భంద తనిఖీలు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

నేరాల నియంత్రణకే నిర్భంద తనిఖీలు
– శాంతిభద్రతలకు అందరు సహకరించాలి
– తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్‌
– కరణ్‌ కోట్ గ్రామంలో పోలీసుల కార్డెన్ సెర్చ్‌
– తనిఖీల్లో 78 వాహనాల స్వాదీనం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: గ్రామాల్లో నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయడం జరుగుతుందని, ఇందుకు ప్రజలు సహకారం అందించాలని తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ అన్నారు. శనివారం తాండూరు రూరల్ సీఐ రాంబాబు, కరణ్‌ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డిల ఆధ్వర్యంలో మండలంలోని కరణ్‌ కోట్ గ్రామంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు, యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు అతి వేగంగా, అజాగ్రత్తగా నడపవద్దని కోరారు. వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. అదేవిధంగా గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే, అసాంఘీక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తమ పై వేధింపులను మహిళలు నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాద చేయవచ్చని పేర్కొన్నారు. యువత చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. నేరాల నియంత్రణ కోసం కార్డెన్‌ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు అందరు సహకరించాలన్నారు. మరోవైపు కరణ్‌ కోట్‌లో నిర్వహించిన కార్డెన్‌ సెర్చ్‌లో సరైన పత్రాలు లేని 78 వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. ఇందులో 72 ద్విచక్ర వాహనాలు, 3 త్రీవీలర్స్, 4 ఫోర్‌ వీలర్‌ వాహనాలను సీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కరణ్‌ కోట్ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

బాలాజీ చిట్స్‌ ఆస్తుల జప్తుకు రంగం సిద్దం
– త్వరలోనే బాధితులకు న్యాయం
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
https://dharshininews.com/16942

పట్టుదలతో లక్ష్యాలను సాధించుకోవాలి
– ఉత్సహాంగా శాలివాహన విద్యార్థుల వీడ్కోలు సమావేశం
– ఆడిపాడిన కళాశాల విద్యార్థులు
https://dharshininews.com/16935

పట్నం వారి పెళ్లి సందడి..!
– వైభవంగా మనీషా రెడ్డి నిశ్చితార్థం
– కాబోయే వధూరులకు ఆశీర్వాదాల వెల్లువ
https://dharshininews.com/16923