నిజ్జ‌మ‌నానికి రండి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

నిజ్జ‌మ‌నానికి రండి
– ఎమ్మెల్సీ, ఎంపీ, ఎస్పీల‌ను క‌లిసిన హిందూ ఉత్స‌వ స‌మితి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రేపు తాండూరు ప‌ట్ట‌ణంలో నిర్వహించే వినాయ‌క నిమ‌జ్జ‌న ఉత్స‌వాల‌కు హాజ‌రుకావాల‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ గ‌డ్డం రంజిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయ‌ణ‌ల‌ను తాండూరు హిందూ ఉత్స‌వ స‌మితి స‌భ్యులు కోరారు. సోమ‌వారం హిందూ ఉత్స‌వ స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయిపూర్ బాల్‌రెడ్డి, ఉపాధ్య‌క్షులు బంటు మ‌ల్ల‌ప్ప‌, స‌భ్యులు బోయ‌రాజు త‌దిత‌రులు ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్పీల‌ను క‌లిసి నిమ‌జ్జ‌న ఆహ్వాన ప‌త్రాల‌ను అంద‌జేశారు. మంగ‌ళ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలో జ‌రిగే వినాయ‌క నిమ‌జ్జ‌న ఉత్స‌వాల‌కు హాజ‌రుకావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎస్పీ నారాయ‌ణ‌లు త‌ప్ప‌క వ‌స్తామ‌ని చెప్పార‌ని స‌మితి స‌భ్యులు తెలిపారు.