ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా
– ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఈనెల 28, 29వ తేదిలలో నిర్వహించే ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో (రేపు, ఎల్లుండి) రాష్ట్రంలో జరుగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
