తాండూర్ భాష్యం విజయదుంభిది
– ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు
– అభినందించిన యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్మీడియట్ ఫలితాలలో తాండూరు ‘భాష్యం కళాశాల’ విజయదుంభిది మోగింది. కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించారని, సాధారణ విద్యార్థులతో అత్యద్భుత ఫలితాలు ‘భాష్యం’కే సాధ్యమని కళాశాల యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ బైపీసీలో నవ్య రెడ్డి 992/ 1000 ,అపర్ణ 988/1000, మరియు ఎంఈసిలో కుసుం 986/1000, ఎంపీసీలో అనిత 980 /1000 ,రజిత 975/1000, సిఇసి లో శార్వాణి 920/1000 లాంటి రాష్ట్ర స్థాయి అత్యున్నత ఫలితాలు సాధించారు. అలాగే మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో ప్రశాంతి 457/470 ,నవ్య శ్రీ 453/470 విటల్ 44/470, వైష్ణవి 441/470 బైపీసీలో W. హరీష్ 416/440, L.మాధురి 415/440, జె.సల్మాన్ 413/440, సాయి స్ఫూర్తి 412/440 CEC లో టీ. సౌమ్య 470/500, శ్రీనివాస్ రెడ్డి 433/ 500 లాంటి అసాధారణ ఫలితాలు సాధించారని తెలిపారు. విద్యార్థులను విజేతలుగా నిలిపిన ఘనత ‘భాష్యం కళాశాల’కే సాధ్యం అయ్యిందన్నారు. ఇంతటి విజయానికి కారణమైన కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూర్పు మైపాల్ రెడ్డి అధ్యాపకులు వెంకటరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

