పేదింటి విద్యాకుసుమాలు
– ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటారు
– ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పేదింటి పిల్లలు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో సత్తా చాటారు. మంగళవారం విడుదలైన పరీక్ష ఫలితాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో ఎంపీపీలో నబియా భేగం (456/470), మంగిణీబాయి(417/470), బైపీసీలో ఫెరోస్ భేగం (389/440), నందిని (349/440), హెచ్ఐసీలో సీహెచ్ శిరీషా (377/500), కె.సబిత (361/500), సెకండ్ ఇయర్ ఎంపీసీలో జీ. ధరణి (925/1000), జోగు అఖిల (917/1000), బైపీసీలో సి.అనిత (913/1000), నందు (912/1000), సీఈసీలో బి. పుష్పలత (892/1000), ఎండీ ఉమర్ హుస్సేన్ (868/1000), హెచ్ ఈసీ లో ఎం.ఆస్రీన్(844/1000), ఎం. నవీస్ (802/1000), సీఈసీ ఉర్దూ మీడియంలో ఫజీలత్ సిద్దిఖా(842/1000), ఆయేషా హుస్నా(817/1000), కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ లో అశ్విని (940/1000), ఎమ్. నందిని (934/1000), కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ లో షోహైబ్ (462/500), మహమ్మద్ మోయిజ్ (458/500), ఏ అండ్ టీ ఫస్ ఇయర్ లో మహవీస్ (482/500), పి.సంధ్య (474/500), సెకండ్ ఇయర్ లో పి.నరేందర్ (908/1000), యాసిన్(892/1000), సీటీ ఫస్ట్ ఇయర్ లో సోహెబ్ (457/500), ఖలీల్ (453/500), సెకండ్ ఇయర్ లో రజాక్ (868/1000), ఎండి. సోహైల్ (840/1000), ఎమ్మెల్టీ సెకండ్ ఇయర్ లో లావణ్య(924/1000), ఎంపీహెచ్ డబ్ల్యూ సెకండ్ ఇయర్ లో సోఫియా (926/1000), కె.నందిని (903/1000)లు సాధించి.. కళాశాల టాపర్లుగా నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్, అద్యాపకులు అభినందనలు తెలిపారు.

