మహిళల సంక్షేమానికి పెద్దపీట
– కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకాలు వరం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఒకే రోజు 293 మంది లబ్దిదారులకు చెక్కుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ చెక్కుల పంపిణీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను పంపిణీ చేశారు. ఒకే రోజు నియోజకవర్గంలోని 293 మంది లబ్దిదారులకు రూ. 3 కోట్లు విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక చేయూతనందించేందుకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. మహిళ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, నాయకులు రాంలింగారెడ్డి, నవాంద్గి పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, రాములు నాయక్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

