ఘనంగా సాహు శ్రీలత జన్మదిన వేడుకలు
– దంపతులను సన్మానించి నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీజేపి వికారాబాద్ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. జన్మదిన సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు సాహు శ్రీలతను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, మహిళ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, కౌన్సిలర్ అంతారం లలిత, నాయకులు పూజారి పాండు, బంటారం భద్రేశ్వర్, భీరప్ప, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, రజనీకాంత్, ముత్తయ్య, రమేష్ తదితరులు తరలివచ్చి సాహు శ్రీలత లక్ష్మీకాంత్‌ల చేత కేక్‌ను కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.



