విజయ సోపానంతోనే మంచి భవిష్యత్తు
– విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఉత్సహారంగా ఫేర్వెల్ పార్టీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : విజయ సోపానంతో ముందుకు సాగినప్పుడే విద్యార్థులకు మంచి ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు సింధు డిగ్రీ కాలేజీ ఫేర్ వెల్ పార్టీ వేడుకలను పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల విద్యార్థిని, విద్యార్థులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి విభిన్న సాంప్రదాయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా విదేశాల్లో విద్యనభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా బీఆర్ఎస్ పార్టీకి ఘనత దక్కుతుందన్నారు. అదేవిధంగా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థులు అన్ని దశల్లోనూ విజయం సాధించినప్పుడు ఆ విజయ సోపానాలే మంచి భవిష్యత్తుకు తోడ్పాటు అందిస్తాయన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బహుమతులు అందించి, అభినందించారు.
ఆడి పాడిన విద్యార్థులు.
మరోవైపు కళాశాల ఫేర్ వెల్ పార్టీ సందర్భంగా విద్యార్థులు ఉత్సహాంగా ఆడిపాడారు. డాన్స్, డ్రామా, పోటీల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవి(మున్సిపల్ కౌన్సిలర్), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కళాశాల ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

