2వేల నోటు చెలామణి చెల్లు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

2వేల నోటు చెలామణి చెల్లు..!
– వెనక్కీ తీసుకోనున్న ఆర్బీఐ
– బ్యాంకులో మార్పిడికి అవకాశం
– నోట్ల ఎక్సేంజ్‌పై లిమిట్‌ ఎంతంటే..?
– అసలు కారణం ఏమిటంటే..?
దర్శిని డెస్క్‌: దేశంలో 2వేల నోట్ల చెలామణికి ఆర్బీఐ చెల్లుచీటి ఇచ్చింది. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారుల నుంచి రూ. 2వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులకు రూ.2 వేల నోట్లు ఇవ్వకూడదని కూడా బ్యాంకలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులు తమ వద్ద ఉన్న 2 వేల నోటును బ్యాంకుల్లో ఎక్స్‌జేంజ్‌ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అయితే సెప్టెంబర్‌ 30లోపు బ్యాంకులకలో మార్చుకోవచ్చని తెలిపింది. 2016లో పాత నోట్లను రద్దు చేసి ఆ స్థానంలో రూ.2వేల నోటును తీసుకువచ్చింది.

ఎంత వరకు ఎక్సేంజ్ చేసుకోవచ్చంటే..?
అయితే ఈ రూ.2 వేల నోట్లను మార్చుకుకోవడానికి ఎలాంటి రుసుము ఉండదు. ఒక వేల ఏదైనా బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునేందుకు నిరాకరిస్తే అంబుడ్స్‌మెన్‌కి ఫిర్యాదు చేయవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఒక విడతలో బ్యాంకులో రూ.20వేల చొప్పున మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. డిపాజిట్‌ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు విధించలేదు. బ్యాంకు రోజు వారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టాలని ఆర్‌బీఐ సూచించింది.

ఎప్పటి వరకు మార్పిడికి అవకాశం అంటే..?
బ్యాంకులు నేటి నుంచే రూ.2 వేల నోట్లను జారీ చేయడం నిలిపివేశాయి. అయితే నోట్ల మార్పిడి మే 23 నుంచి మార్చుకునే అవకాశం ఉందని తెలిపింది. 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్‌ 30 వకూ ఈ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునే వీలుంటుందని ఆర్బీఐ తెలిపింది.

అసలు కారణం ఇదే..
2016 నవంబర్‌లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు నేపథ్యంలో నగదు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.2వేల నోట్లను తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. 2018-19లోనే ఈ నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసింది. క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా రూ.2000 నోట్లను ఉపసంహరణ, 2018-19లోనే రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేశామని ఆర్బీఐ తెలిపింది. 023 మార్చి నాటికి ఆ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. అంటే చలామణీలో ఉన్న మొత్తం నగదులో రూ.2వేల నోట్ల వాటా 10.8 శాతానికి తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది. క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా రూ.2వేల నోట్లను చలామణీని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అయితే, రూ.2వేలు నోటు అనేది ప్రస్తుతం లావాదేవీలకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి…
వేపాకుతో రోగాల దిగులు దూరం
– ఆకులో అద్భుతమైన ఔషధ గుణాలు
– తెలుసుకుని పాటిస్తే మేలు
https://dharshininews.com/17186
chaithany collage